నూతన క్రికెట్‌ సలహా కమిటీని నియమించిన బీసీసీఐ..

బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) నూతన క్రికెట్‌ సలహా కమిటీ(అడ్వైజరీ కమిటీ)ని నియమించిది. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీని రూపొందించారు. వారిలో మదన్‌లాల్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌, సులక్షణ నాయక్‌ ఉన్నారు. సంవత్సరం పాటు వారు ఈ విధుల్లో కొనసాగుతారు. కాగా, వీరు ముగ్గరూ గతంలో భారత క్రికెట్‌కు తమ సేవలందించినవరే. 


మదన్‌లాల్‌ ఇండియా తరఫున 39 టెస్టులు, 67 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. 1983లో భారత్‌ ప్రపంచకప్‌ నెగ్గిన జట్టులో మదన్‌లాల్‌ సభ్యులు. తర్వాత ఆయన జాతీయ జట్టుకు కోచ్‌గా కూడా పని చేశారు. తదనంతరం, సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ మెంబర్‌గా కూడా వ్యవహరించారు. రుద్రప్రతాప్‌ సింగ్‌(ఆర్‌ పీ సింగ్‌).. ఇండియా తరఫున 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ 20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించారు. సులక్షణ తన 11 ఏళ్ల క్రికెట్‌ కేరీర్‌లో భారత్‌ తరఫున 2 టెస్టులు, 46 వన్డేలు, 31 టీ 20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించారు.  ఇంతకు ముందు బీసీసీఐ అడ్వైసరీ మెంబర్లుగా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించారు.