కరోనా విజృంభిస్తున్న వేళ..తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విధి నిర్వహణలో మృతిచెందిన వైద్య, ఆరోగ్య, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాటుగా వారికి రూ.50లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. కాగా తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటి వరకు అక్కడ 1,596 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 18 మంది మృతిచెందగా..635 మంది కోలుకున్నారు.