జార్ఖండ్‌లో పొగాకు ఉత్ప‌త్తుల‌పై నిషేధం

రాంచి: ‌జార్ఖండ్ ప్ర‌భుత్వం పొగాకు ఉత్ప‌త్తుల‌పై నిషేధం విధించింది. పొగాకు ఉత్ప‌త్తులైన సిగ‌రెట్లు, బీడీలు, పాన్ మ‌సాలా, హుక్కా, గుట్కాల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్న‌ట్లు జార్ఖండ్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు జార్ఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నితిన్ మ‌ద‌న్ కుల‌క‌ర్ణి ఉత్త‌ర్వులు జారీచేశారు. అదేవిధంగా పాన్‌, గుట్కాలు తిని రోడ్ల‌పై ఉమ్మివేసే వారికి ఆరు నెల‌ల జైలుశిక్ష ప‌డుతుంద‌ని జార్ఖండ్ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. రోడ్ల‌పై ఉమ్మి వేయ‌డంవ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని కుల‌క‌ర్ణి పేర్కొన్నారు.